తిరుమల సత్రాలలో తిరుగుతున్న చిరుత (వీడియో)
లాక్‌డౌన్ కారణంగా శ్రీవారి ఆలయ ప్రాంగణం అంతా నిర్మానుషంగా మారిపోయింది. భక్తులు ఎవరూ రాకపోవడంతో వన్యప్రాణులు తరుచూ ఆలయ ప్రాంగణంలో యదేశ్చగా తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో క్రూర మృగాలు కూడా వచ్చి అందరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి సత్రం వద్ద కనిపించి హడలెత్తించింది. కర్ణాటక సత్రం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దాని కదలికలు నమోదు అయ్యాయి. దీంతో ఆలయ సిబ్బంది భయంతో వణికిపోతున్నారు.
రింగురోడ్డు సమీపంలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. గత రెండు రోజులుగా అది అక్కడే తిరుగుతోంది. విషయం తెలిసినవెంటనే ఫారెస్ట్ అధికారులు వచ్చి సత్రాల వద్ద తనిఖీలు చేపట్టారు. దాన్ని పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఆలయానికి భక్తులను అనుమతిస్తున్న నేపథ్యంలో ఇలా పులి సంచరించడం కలకలం రేపుతోంది. కాగా లాక్‌డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడం వల్లే పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్డుపైకి వస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.