చిరుత చిరుతే... తనకంటే 3 రెట్ల బరువుతో జంప్.. - MicTv.in - Telugu News
mictv telugu

చిరుత చిరుతే… తనకంటే 3 రెట్ల బరువుతో జంప్..

March 31, 2020

Leopard climb tree with heavy weight 

చిరుతపులులు వేగానికే కాదు, భారీ బరువుల మోతకు కూడా పేరొందినవే. తనకంటే మూడు రెట్లకుపైగా బరువున్న జంతువులను అలవోకగా వేటాడే చిరుతలకు మరో కళ కూడా ఉంది. ఆ బరువుతో ఏకంగా 20 నుంచి 30 అడుగుల ఎత్తున్న చెట్లను ఎక్కేస్తాయి. అక్కడ వేటను భద్రంగా ఉంచుకుని నెమ్మదిగా తినేస్తాయి. 

ఇలాంటి సీన్ ఉన్న వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఓ దుప్పిన వేటాడిన చిరుత దాన్ని నోట కరచుకుని చెట్టువద్ద తచ్చాడింది. పక్కను ఎవరో వీడియో తీస్తున్నా పట్టించుకోలేదు. బాగా వాటం చూసి నోట దుప్పితోపాటు టక్కున చెట్టు ఎక్కేసింది. వేటను చెట్ల కొమ్మల మధ్య జాగ్రత్తగా పెట్టుకుంది. అటవీ అధికారి పర్వీన్ కాస్వాన్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో మనదేశంలో తీసిందికాదు. ఈ వీడియోలకు సోషల్ మీడియాలో వేల లైక్స్ వస్తున్నాయి.