స్కూలుకొచ్చిన చిరుతపులి.. పరుగో పరుగో.. ఓ కుక్క బలి..  - MicTv.in - Telugu News
mictv telugu

స్కూలుకొచ్చిన చిరుతపులి.. పరుగో పరుగో.. ఓ కుక్క బలి.. 

February 27, 2020

c bvgnb

ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా గడిపేస్తున్న పిల్లలకు గాండ్రింపు శబ్దం వినిపించింది. మొదట్లో ఎవరో అలా అరిచారని తేలిగ్గా తీసుకున్నారు. కానీ కళ్లముందు చిరుతపులి వచ్చి నిలబడింది. అంతే, పరుగు పరుగునా క్లాస్ రూముల్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. పులి అటూ ఇటూ తచ్చాడింది. చివరికి అక్కడే తిరుగుతున్న ఓ కుక్కను లటుక్కున పట్టుకుని ఈడ్చుకునిపోయింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

కీరాత్పూర్ గ్రామంలోని పాఠశాలలోకి బుధవారం సాయంత్రం చిరుత చొరబడింది. పిల్లలు అప్రమత్తమై గదుల్లోకి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత ఓ కుక్కను చంపిన పులి దాన్ని పక్కనే ఉన్న అడవిలోకి ఈడ్చుకెళ్లింది. స్కూటు ప్రధానోపాధ్యాయురాలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి మళ్లీ రావొచ్చనే అనుమానంతో ఇద్దరు పోలీసులను అక్కడ కాపలాగా ఉంచారు.