14 ఏళ్ల బాలుడిని చంపేసిన చిరుత.. గ్రామంలో టెన్షన్ టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

14 ఏళ్ల బాలుడిని చంపేసిన చిరుత.. గ్రామంలో టెన్షన్ టెన్షన్

September 28, 2020

GHVJY

కొంత కాలంగా వన్యమృగాలు గ్రామాల్లో యథేశ్చగా విహరిస్తున్నాయి. అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తుండం, దాడులు చేయడంతో అటవీ పరివాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఓ చిరుత పులి 14 ఏళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది. పొలంలో పనిచేస్తున్న సమయంలో పొదల్లోంచి ఒక్కసారిగా మీద దూకింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన యూపీలోని  ఖేరీ అటవీ డివిజన్ పరిధిలోని సహబ్దిన్ పుర్వాగ్రామంలో జరిగింది.

సహబ్దిన్ పుర్వా గ్రామానికి చెందిన చందన్ అనే 14 ఏళ్ల బాలుడు పశువుల కోసం తన పొలంలో మేత కోస్తున్నాడు. అప్పటికే ఆ  పొదల్లో చిరుత పులి దాక్కుంది. ఇది గమనించిన అతడు తన పనిలో ఉండగా మీదకు దూకి దాడి చేసింది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పొలం వద్దకు వెళ్లగా చనిపోయి కనిపించాడు. గాఘ్రా నది సమీపంలో గ్రామస్థులకు చిరుతపులి మరోసారి కనిపించింది.  కాగా, ఈ నెల 14వతేదీన బ్రిజేష్ అనే మరో బాలుడిని పులి చంపింది. తరచూ పులులు, చిరుతల దాడులతో అటవీగ్రామాల ప్రజలు పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అధికారులు రక్షణ కల్పించాలని  కోరుతున్నారు.