ఆదివారం బడికొచ్చిన చిరుత.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆదివారం బడికొచ్చిన చిరుత..

December 11, 2017

ముంబై మహానగరంలో చిరుత పులుల హల్‌చల్  ఎక్కువైంది. కొన్నాళ్ల కిందట చిరుత రేపిన కలకలాన్ని మరచిపోకముందే మరో చిరుత అడుగుపెట్టింది. ఓ నర్సరీ స్కూల్లో కలియదిరిగింది. బుద్ధిగా ఓ క్లాస్ రూంలో చాలాసేపు కూర్చుంది. అయితే ఆదివారం కావడం వల్ల పిల్లలు, టీచర్లు లేకపోవడంతో ముప్పు తప్పింది.


ఆదివారం అంధేరీలోని షేరే పంజాబ్ కాలనీలోని నర్సరీ స్కూల్లో ఈ సంఘన జరిగిదంది. స్థానికులు దీన్ని గమనించి పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు తలుపులు వేసుకుని భయంగా గడిపారు. స్కూల్లో చిరుత అక్కడా ఇక్కడా తిరుగుతూ సీసీ కెమెరాల్లో పడింది. దాదాపు 12 గంటలపాటు అక్కడే ఉంది. చివరికు ఒక క్లాస్ రూంలో తిష్టవేసింది. అటవీ శాఖ సిబ్బంది దానికి ఎట్టకేలకు మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. వైద్య పరీక్షల కోసం పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ చిరుత ఇదివరకు నగరంలోకి వచ్చిన చిరుతనా, లేకపోతే మరొక చిరుతనా అని పోలీసు విచారణ జరుపుతున్నారు. గతంలో చిక్కిన చిరుత శరీరంలో చిప్ పెట్టి మళ్లీ అడవుల్లో వదిలేశారు. సమీప అటవీ ప్రాంతంలో తిండి దొరక్క చిరుతలు నగరంలోకి చొరబడుతున్నాయి. ముఖ్యంగా వీధికుక్కలను తింటున్నాయి.