అమ్మో...గుట్టపై కూర్చున్న చిరుత..! - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మో…గుట్టపై కూర్చున్న చిరుత..!

June 2, 2017

జైపూర్ – ఆగ్రా నేష‌న‌ల్ హైవే 11 పై చిరుత‌పులి కలకలం రేపింది. ఆగ్రా రోడ్ లోని ఘాట్ కి ఘుని ద‌గ్గ‌ర్లోని గుట్ట‌పై చిరుత నక్కింది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ కు 300 మీట‌ర్ల దూరంలోని నేష‌న‌ల్ హైవే ప‌క్క‌న ఉన్న గుట్ట‌ల‌పై చిరుత కూర్చోవ‌డంతో రోడ్డు మీద వెళ్లేవాళ్లు భయపడ్డారు. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని వెళ్లారు. నాలుగైదు గంటలు గుట్టపై కూర్చున్న చిరుత ఎవరినీ ఏమీ అనలేదు…గురువారం ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 2.30 వ‌ర‌కు అది అలాగే రాయి మీద కూర్చొని ఉంద‌ట కాని ఎవ్వ‌రినీ ఏమీ అన‌లేద‌ట‌.. న‌హ‌ర్గార ఫారెస్ట్ కు వెళ్ల‌బోయి దారి తప్పి నేష‌న‌ల్ హైవే ద‌గ్గ‌రే ఆ పులి ఆగిపోయి ఉంటుంద‌ని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు.