తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులపై చిరుత దాడి - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులపై చిరుత దాడి

August 4, 2020

Leopard on Tirumala Devotees s.

లాక్‌డౌన్ కారణంగా తిరుమలలో గత కొన్ని రోజులుగా వన్యప్రాణులు,క్రూర మృగాల సంచారం ఎక్కువైంది. గతంలో చాలా సార్లు చిరుతలు ఘాట్‌రోడ్, ఆలయ సమీప ప్రాంతాల్లో కనిపించేవి. అప్పట్లో భక్తులు లేకపోవడంతో పెద్దగా ప్రమాదం ఏమి ఉండేది కాదు. కానీ ఇటీవల భక్తులు స్వామి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో చిరుత కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అలిపిరిలో ఓ చిరుత భక్తులపై దాడి చేసింది. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా వారిపై దూకింది. వెంటనే అప్రమత్తమై  అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. 

బైక్‌పై వెళ్తన్న ఇద్దరు భక్తులు అలిపిరి నాలుగు కిలోమీటర్ల మూల మలుపు వద్ద చిరుత దాడి చేసింది. ఒక్కసారిగా వారిపై దూకడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమై దాని బారి నుంచి తప్పించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పెట్రోలింగ్ వాహనాన్నిపంపించారు. ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో భక్తులు భయంతో వణికిపోతున్నారు. భక్తులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా చాలా రోజుల నుంచి చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు అడవి నుంచి బయటకు వస్తున్న సంగతి తెలిసిందే.