ఏడేళ్ల బాలికను చంపేసిన చిరుత.. నెలలో ఐదుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏడేళ్ల బాలికను చంపేసిన చిరుత.. నెలలో ఐదుగురు మృతి

October 13, 2020

Uttarakhand,Leopard,Girl,Forest,Chirutha .

అడవులను వదిలి చిరుతలు గ్రామాలపై పడుతున్నారు. నిత్యం ప్రజలపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా చిరుత దాడిలో ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరాఖండ్‌లోని  తెహ్రీలో ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే మొత్తం ఐదుగురు చిన్నారులు చిరుత దాడిలో మ‌ర‌ణించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. 

ఐదేళ్ల బాలిక రాత్రి 9.30 గంటల సమయంలో కాల‌కృత్యాల కోసం బయటకు వెళ్లింది. అప్పటికే పొదలమాటున దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్ర‌గాయాల‌ పాలైన ఆ చిన్నారి అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలిసిన వెంటనే అటవీ అధికారులు వచ్చి చిరుతను బందించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. కాగా, ఆ ప్రాంతంలో ఇది ఐదో ఘటనగా స్థానికులు చెబుతున్నారు. గత నెల 24న తొలిసారి ఓ బాలిక‌పై చిరుత దాడిచేసింది. వ‌రుస ఘ‌ట‌న‌లతో తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.