కంబదూరులో ఉన్న దుర్గం కొండ ప్రాంతంలో చిరుత మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. దుర్గం కొండా ప్రాంతంలో కొందరు స్థానికులు ఆదివారం చిరుత మృతదేహాన్ని చూశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వాళ్ళు అక్కడికి చేరుకొని చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ చిరుత అనారోగ్యం కారణంగా మృతి చెందిందా లేదా ప్రాణ రక్షణ కోసం ఎవరైనా రైతులు చంపి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.