థూ.. నా బతుకు చెడ.. చిరుతపులి పశ్చాత్తాపం (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

థూ.. నా బతుకు చెడ.. చిరుతపులి పశ్చాత్తాపం (వీడియో)

November 21, 2019

అది కావాలని దేని జోలికీ వెళ్లదు.. తన జోలికి వస్తే మాత్రంతడాఖా చూపిస్తుంది. అందుకే అది అంటే అడవిలో ఇతర జంతువులకు హడలే. పులులు, సింహాలను కలపుకుని కూడా. ఏ జంతువబ్బా అని ఆలోచిస్తున్నారా? ముళ్లు అన్నాం కాబట్టి ముళ్లపంది అని డిసైడ్ అయిపోయారు కదూ. అవును మీరు అనుకున్నది నిజమే. ముళ్లపందితో పెట్టుకున్న ఏ జంతువూ గెలిచినట్టు చరిత్రలో లేదు. అదే జరిగింది ఈ వీడియోలో. క్రూర మృగమైన చిరుతపులిని ముళ్లపంది ఉచ్చ పోయించింది. నాతో పెట్టుకుంటావా.. నీ కోరలు, గోర్లు జాగ్రత్త అన్నంత పనే చేసింది. ముళ్లపంది, చిరుత భీకర యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.  

అసలు ఏం జరిగిందంటే.. అడవి మార్గం గుండా వెళుతున్న ముళ్లపందిని చూసి చిరుత దాడికి పాల్పడింది. దీనిని వీడియో తీసిన పర్విన్‌ కశ్వాన్‌ అనే ఓ ఆటవీ అధికారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘ముళ్లపందికి, చిరుతకు మధ్య భీకర పోరాటం.. చివరకు చిరుత గుణపాఠాన్ని నేర్చుకుంది’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్‌, వందల్లో కామెంట్లు వచ్చాయి.

వీడియోలో తనపై దాడి చేస్తున్న చిరుతను చూసి ముళ్లపంది భయపడలేదు. వెనకకు తిరుగుతూ తన వాడి ముళ్లను చూపించసాగింది. నీ ముళ్లు నాముందు ఎంత అనుకుని బీరాలు పోయింది చిరుతు. దాని ముళ్లను కరవబోయింది. దీంతో దాని నోట్లో పంది ముళ్లు దిగబడ్డాయి. దీంతో చిరుత చచ్చింది గొర్రె అనుకుని నొప్పితో  విలవిలలాడింది. చివరకు దాంతో పెట్టుకుంటే నా పని అయపోతుంది అని బుద్ధి తెచ్చుకుంది. తిన్నగా తన దారిన తాను వెళ్లిపోయింది. బలవంతుడనని పోజు కొట్టేవారు ఇలా తోక ముడవాల్సిందే అని చాలామంది చేస్తున్నారు.