నల్గొండలో చిక్కిన చిరుత..హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి - MicTv.in - Telugu News
mictv telugu

నల్గొండలో చిక్కిన చిరుత..హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి

May 28, 2020

gnbvgn

నల్గొండ జిల్లాలో చిరుతపులి హల్ చల్ చేసిన సంగతి తెల్సిందే. గురువారం ఉదయం జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేట తండాలో రైతులు ఉంచిన వలలో చిరుతపులి చిక్కుకుంది. దీంతో వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, జూ సిబ్బంది హుటాహుటిన వెళ్లి చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు. 

tiger

Publiée par Shiva Balla sur Jeudi 28 mai 2020

కొంత సమయం శ్రమించి ఆ చిరుతను పట్టుకున్నారు. తరువాత దానికి ఇంజెక్షన్ ఇచ్చి బంధించి హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చిరుత పులి చనిపోయింది. ఈ మేరకు జూ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చనిపోయిన మగ చిరుతకు వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. దీని వయసు ఏడేళ్లని తెలిపారు. కాగా, చిరుత లోపలి భాగాల్లో రక్తస్రావం జరిగిందని, దీంతో ఊపిరితిత్తుల్లో రక్తం చేరి ఊపిరాడక అది చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది.