వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిని చంపిన చిరుత  - MicTv.in - Telugu News
mictv telugu

వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిని చంపిన చిరుత 

May 16, 2020

Leopard Spotted In Bangalore

అడవిని వదిలి వన్య మృగాలు జనావాసాలకు వచ్చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఎవరూ బయటకు రాకపోవడంతో పులు దర్జాగా గ్రామాల్లో విహరిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ శివారుల్లో ఓ చిరుత హడలెత్తించగా.. బెంగుళూరులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.శనివారం తెల్లవారుజామున నగర శివారుల్లో ఓ వృద్ధురాలిపై దాడి చేసి దారుణంగా చంపేసింది. ఈ ఘటనతో స్థానికులంతా భయాందోళనకు గురౌతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు. 

కొట్టగణహల్లి గ్రామానికి చెందిన గంగమ్మ (68) ఉదయం పూట వాకింగ్ కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో పొదల మాటు నుంచి వచ్చిన చిరుత దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి దాని ఆనవాళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా 10 రోజుల క్రితమే కదిరైహన పాల్యలో మూడేళ్ల బాలుడు హేమంత్‌పై చిరుత దాడి చేసింది. ఆ వెంటనే మరో ఘటన చోటు చేసుకోవడంతో వణికిపోతున్నారు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.