Leopard that killed 4 in Lakhimpur Kheri gets zoo 'life term'
mictv telugu

మనుషుల రక్తం రుచి మరిగిన పులికి జీవిత ఖైదు

November 24, 2022

ఓ చిరుత పులికి జీవిత ఖైదు విధించారు అధికారులు. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ జిల్లా అటవీ అధికారులు ఆ పులిని జీవితాంతం బోనులోనే బంధించాలని నిర్ణయించారు. నలుగురి ఫారస్ట్ గార్డులను చంపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివారాల్లోకి వెళితే ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి ఆక్టోబర్ 20 వరకు గోలా తహసీల్ పరిధిలో నలుగురు గార్డులను చిరుత దాడి చేసి చంపేసింది. అది రక్తం మరగడంతో ఇంకా దాడులకు తెగబడుతాదని భావించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాడి చేస్తున్న చిరుతను గుర్తుపట్టి దానిని కదలికలపై నిఘా పెట్టారు.

గోలా అటవీ పరిధిలో దాదాపు 25 సీసీ కెమెరాలు బిగించి చిరుత సంచరించే ప్రదేశాలను గుర్తించారు. ఆపై ఆరు చోట్ల బోనులు ఏర్పాటు చేయగా చివరకి చిరుత చిక్కింది. దానిని జూకు తరలించి, జీవితాంతం బోనులోనే ఉంచాలని నిర్ణయించారు. రక్తం రుచి మరగడంతో చిరుతను వదిలిపెట్టడం ప్రమాదకరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బోనులో చిక్కిన చిరుత పూర్తి ఆరోగ్యంగా, దృఢంగా ఉందని లఖీంపూర్ ఖేరీ డివిజన్ అటవీ అధికారి సంజయ్ బిశ్వాల్ తెలిపారు. సాధారణంగా గాయపడిన చిరుతలు వేటాడేందుకు ఓపిక లేక మనుషులపై దాడి చేస్తాయని చెప్పారు. కానీ ఈ చిరుత మాత్రం రక్తం రుచి మరిగి మనుషులపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు.