స్త్రీని రత్నం అంటారు…ఎందుకంటే స్త్రీలు దాదాపు నగలు ప్రియులై ఉంటారు. కొందరికి బంగారం, వెండి ఇష్టం ఉంటే..మరికొంత మంది కృత్రిమ ఆభరణాలపై ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం కంటే ఈ కృత్రిమ ఆభరణాలకే గిరాకీ పెరిగింది. దీంతో కృత్రిమ ఆభరణాల వ్యాపారులకు మంచి లాభాలు వస్తున్నాయి. మీలో కూడా ఇలాంటి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉందా. కృత్రిమ ఆభరణాలు రంగంలోకి ప్రవేశించవచ్చు. ఇప్పుడు కృత్రిమ ఆభరణాల వ్యాపారం గురించి కొంత సమాచారం తెలుసుకుందాం.
కృత్రిమ నగల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? :
కృత్రిమ నగల వ్యాపారాన్ని ప్రారంభించే ముందు చిన్న చిన్న ఆభరణాలతో స్టార్ట్ చేయడం మంచిది. మీరు ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభింవచ్చు. మీ చుట్టూ ఉన్నవారికి వీటికి విక్రయించవచ్చు. లేదంటే ఆన్ లైన్లో నూ విక్రయించి సోమ్ము చేసుకోవచ్చు. ఈ కామర్స్ కంపెనీతో డీల్ చేసుకుని కూడా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. ఈ కామర్స్ వెబ్ సైట్లో మీరు కస్టమర్లకు ఆభరణాలు విక్రయిస్తే సరిపోతుంది. ఎందుకంటే పంపిణీ బాధ్యత అంతా కూడా కంపెనీనే చూసుకుంటుంది. మీకు కమీషన్ కూడా ఇస్తుంది. కానీ కృత్రిమ నగల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలన్న ఐడియాను మీకోసం అందిస్తున్నాం.
మీరు షాప్ ప్రారంభించే ముందు సరైన స్థలాన్ని ఎంపిక చేసుకోండి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయితే బాగుంటుంది. దుకాణం ముందు పార్కింగ్ ఉండేలా చూసుకోండి. మీ షాప్ కు అందమైన పేరు పెట్టండి. లేదంటే చిన్నగా వ్యాపారం ప్రారంభించాలంటే మీ ఇంట్లోనుంచి చేయడం ఉత్తమం. మీకు పరిచయాలు ఎక్కువగా ఉంటే..ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తారు.
షాపు షాప్ రిజిస్ట్రేషన్. లైసెన్సింగ్:
మీరు ఒక గ్రామం లేదా నగరంలో చిన్న తరహా నగల దుకాణాన్ని తెరిస్తే మీరు జీఎస్టీ కోసం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద ఎత్తున నగల దుకాణాన్ని తెరిస్తే, GST కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టోర్ ప్రమోషన్ :
ఈ రోజుల్లో ప్రమోషన్ చాలా ముఖ్యం. మీరు స్టోర్ ప్రారంభానికి చాలా మంది వ్యక్తులను ఆహ్వానించాలి. మీరు మీ వ్యాపారాన్ని తప్పనిసరిగా అందరికీ పరిచయం చేయాలి. మీరు పరిసర ప్రాంతంలో టెంప్లేట్‌ను పంపిణీ చేసుకుంటే అందరికీలోకి రీచ్ అవుతుంది. ఆభరణాలు ట్రెండింగ్ ను బట్టి మీ దుకాణంలో ఏర్పాటు చేస్తే మంచి రాబడి వస్తుంది. ఆన్‌లైన్‌లో కూడా ప్రమోషన్ వర్క్ చేయాలి. . ఆన్‌లైన్ విక్రయ సదుపాయం కూడా ఉంటే మీ బిజినెస్ మరింత ముందుకు సాగుతుంది.
కృత్రిమ ఆభరణాల వ్యాపారం ఖర్చు:
ఆభరణాల వ్యాపారం తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. పెద్ద దుకాణం తెరవాలంటే దాదాపు 5 నుంచి 10లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.
ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వ్యాపారంలో లాభం :
చాలా మంది మహిళలకు ఆభరణాలంటే చాలా ఇష్టం. కాబట్టి మంచి డిజైన్‌తో కూడిన నాణ్యమైన ఆభరణాలను ఉంటే చాలా లాభాలు పొందవచ్చు. కష్టపడి, అంకితభావంతో ఈ వ్యాపారాన్ని కొనసాగించాలనుకుంటే నెలకు లక్షల్లో లాభం పొందవచ్చు. మీ స్టోర్ స్థానం, మీరు కలిగి ఉన్న డిజైన్, ఆభరణాల ధర, కస్టమర్‌లతో మీరు పరస్పర చర్య చేసే విధానం అన్నీ చాలా ముఖ్యమైనవి.