less time sleep can harm kids brian
mictv telugu

నిద్రలోనే ఎదుగుతారు.

December 21, 2022

 less time sleep can harm kids brian

చిన్నపిల్లలు అనగానే సాధారణంగా అందరూ తిండి మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. వాళ్ళకు అన్ని రకాల ఫుడ్స్ అలవాటు చేయడానికి, వాళ్ళ చేత ఎక్కువ తినిపించడానికి తంటాలు పడుతుంటారు. దాని కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. వెంటపడి వెంటపడి మరీ తినిపిస్తారు. అవసరమైతే డాక్టర్ల చుట్టూ కూడా తిరుగుతుంటారు. తిండి అవసరమం, చాలా ముఖ్యం కూడా. కానీ దానితో పాటూ అంతే సమానం నిద్ర. మామూలు మనిషికే సగటున ఎనిమిది గంటలు నిద్ర ఉండాలని చెప్తారు. అలాంటిది పిల్లలకు ఇంకెంత అవసరమో కూడా మనం గుర్తించాలి.

అప్పుడే పుట్టినవాళ్ళు గురించి పెద్దగా చెప్పుకోనక్కరలేదు. ఎందుకంటే వాళ్ళు సహజంగానే ఎప్పుడూ నిద్రలోనే ఉంటారు. ఆరు నెలల నుంచి దాదాపు రెండేళ్ళ వరకు పిల్లలు 18 గంటలు నిద్రపోతారు రోజుకు. అది వారికి చాలా ముఖ్యం కూడా. తరువాత నుంచి నిద్ర పోయే టైమ్ తగ్గినా కూడా అప్పుడు కూడా 12 గంటలు వాళ్ళు నిద్రపోయేట్టు చేయాలి. ఒక అధ్యయనం ప్రకారం రాత్రి ఎనిమిది నుంచి మర్నాడు ఉదయం ఏడు గంటల వరకూ లేవకుండా పడుకునే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలింది. అంతే కాదు వీళ్ళు ఊబకాయం వంటి సమస్యల బారిన కూడా పడకుండా ఉంటున్నారుట. రాత్రి లేస్తూ ఉండడం వల్ల పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నారు తల్లిదండ్రలు. అదే కాకుండా రాత్రి సరిగ్గా నిద్రపోని పిల్లలకు మర్నాడు ఆకలి కూడా ఎక్కువ ఉంటోందిట. దీంతో వాళ్ళు తినిల్సినదానికన్నా ఎక్కువ తింటున్నారని రిసెర్చర్స్ చెబుతున్నారు. ఇలాంటి ప్యాట్రన్ ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. పిల్లల్లో ఊబకాయం డయాబెటీస్ కు కూడా దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది పిల్లలు చిన్నవయసులోనే మధుమేహం బారిన పడుతున్న కేసులు ఎక్కువయ్యాయని చెబుతున్నారు.

ఇక 6 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ పిల్లలు అయితే కనీసం 9 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు నిపుణులు. తొమ్మిది గంటలు నిద్రలేని పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, టాంటరమ్, అల్లరి, మొండితనం లాంటి గుణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు తక్కువ నిద్రపోయే వాళ్ళు స్లో లెర్నర్లుగా కూడా తయారవుతున్నారుట. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మెదడు పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది వయసుకు తగ్గట్టు పెరగాలంటే సరైన తిండి ఎంత అవసరమో, అంతే నిద్ర కూడా అవసరం అని చెబుతున్నారు. నిద్ర తక్కువ ఉన్నవారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమస్యలను డీల్ చేసే లాంటి పనులకు అవసరమయ్యే మెదడు భాగం సరిగ్గా పెరగడం లేదని చెబుతున్నారు నిపుణులు.

పిల్లల ఎదుగుల విషయంలో తల్లిందడ్రులదే పూర్తి బాధ్యత అంటున్నారు డాక్టర్లు, నిపుణులు. ఆరేళ్ళ తర్వాత పిల్లలకు తెలుస్తుంది, వాళ్ళకేం కావాలో వాళ్ళే చూసుకుంటారు అని వదిలేయకుండా వాళ్ళకు నిద్ర అలవాటు చేయాలని సూచిస్తున్నారు. కచ్చితంగా 9 గంటలు నిద్రపోయేలా పిల్లలకు షెడ్యూల్ పూరెంట్సే ఏర్పాటు చేయాలి. వాళ్ళమీద ఒత్తిడి తగ్గించి, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అన్నీ నేర్చుకోవాలి, నేర్పాలి అనే తాపత్రయం ఉన్నా నిద్ర టైమ్ మాత్రం తగ్గకుండా ఉండేటట్టే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలు సరిగ్గా ఎదగాల్నా, వాళ్ళ మెదళ్ళు షార్స్ గా ఉండాలన్ని తల్లిదండ్రలుల ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.