500 రైళ్లు వచ్చినా పట్టాలపైనే ఉంటారన్నాడు.. ఘోరానికి ముందు.. - MicTv.in - Telugu News
mictv telugu

500 రైళ్లు వచ్చినా పట్టాలపైనే ఉంటారన్నాడు.. ఘోరానికి ముందు..

October 20, 2018

61 నిండు ప్రాణాలును బలిగొన్న అమృత్‌సర్ ప్రమాదం వెనుక షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక కౌన్సిలర్ కొడుకు రెచ్చగొట్టినవైనం బయటికొచ్చింది.  ప్రమాదానికి ముందు అతడు.. రైలు పట్టాలపై నిల్చున్నా ఏమీ జరగదని నోటికొచ్చిట్లు వాగిన వీడియో బయటపడింది.

ఈ వేడుకలను స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ మితూ మదన్ కొడుకు నిర్వహించగా, ముఖ్య అతిథిగా పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ హాజరైంది. ఆమెను పూలదండతో సత్కరించిన తర్వాత కౌన్సిలర్ కొడుకు ప్రసంగించాడు. ‘మేడం.. ఇక్కడ చూడండి. వచ్చిన వాళ్లు ట్రాక్‌ మీద నిలబడిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉత్సాహంగా ఉన్నారు.. మీ కోసం 5000 వేల మందికిపైగా రైలు పట్టాలపై నిలబడి చూస్తున్నారు. 500 రైళ్లు వచ్చినప్పటికీ.. వాళ్లు మాత్రం అక్కడ నుంచి కదలరు’ అని ఆమె మెప్పుకోసం వాగాడు. నవజ్యోత్ కూడా సంతోషంగా కనిపించింది. ప్రమాదం తర్వాత ‘500 రైళ్ల’ అధికప్రసంగి పత్తా లేకుండ పోయాడు. కాగా, నిర్వాహకులు తమ అనుమతి తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. తప్పంతా రైల్వేదే అని పోలీసులు, కాదు పోలీసులదే అని రైల్వే, నిర్వాహకులదే అని అధికారులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

tt