ఆయుధాల్ని వీడం.. యుద్ధాన్ని ఆపాం: జెల్‌న్ స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆయుధాల్ని వీడం.. యుద్ధాన్ని ఆపాం: జెల్‌న్ స్కీ

February 26, 2022

nhfgnfnh

ఉక్రెయిన్ దేశంపై రష్యా బలగాలు మరింత దూకుడు పెంచాయి. ఇప్పటీకే ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌ను సొంతం చేసుకున్న రష్యా బలగాలు.. శనివారం మరో రెండు ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. ఇటీవలే రష్యా విదేశాంగ మంత్రి ‘ఉక్రెయిన్ సైన్యం ఆయుధాల్ని వదిలిపెట్టి, లొంగిపోతే చర్చలకు మేము సిద్దం’ అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ ప్రకటనను తిరస్కరిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. “ఎట్టి పరిస్థితుల్లో కీవ్ ప్రాంతాన్ని పోగోట్టుకోం. రష్యా బలగాలకు లొంగిపోం. ఆయుధాలను వదలం. యుద్ధాన్ని ఆపాం” అని తేల్చి చెప్పాడు.

అంతేకాకుండా ఈ పోరాటంలో ఇప్పటికే వందలాది మంది రష్యా సైనికులను హతమార్చామని, ఉక్రెయిన్ దేశం సైతం కొంతమంది హీరోలను కోల్పోయింది అని ఆయన విచారం వ్యక్తం చేశారు. కిండర్ గార్డెన్ సహా ఉక్రెయిన్ నివాస భవన సముదాయాలపై రష్యా బహుళ రాకెట్ వ్యవస్థలను ప్రయోగిస్తోందని ఆరోపించారు.

మరోపక్క అమెరికా ఈ కల్లోల పరిస్థితుల నేపథ్యంలో తనను కీవ్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటూ ఇచ్చిన ఆఫర్‌ను అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. “ఇక్కడ యుద్ధం జరుగుతోంది. నాకు ఆయుధాలు కావాలి. పారిపోవడానికి సాయం కాదు” అని అమెరికాకు గట్టిగా సమాధానం చెప్పారు.