ఎవరు ఎత్తో తేల్చుకుందాం రా.. కొడుకుతో మహేశ్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరు ఎత్తో తేల్చుకుందాం రా.. కొడుకుతో మహేశ్ వీడియో

May 23, 2020

mahwsh...

బుడిబుడి అడుగులు వేసిన కొడుకు తనంత ఎత్తు ఎదగగానే తండ్రి ఇక నా కొడుకే అన్నీ చూసుకుంటాడని భావిస్తాడు. అప్పటినుంచి కొడుకును మందలించాలంటే తండ్రి ఆలోచిస్తుంటాడు. అయితే తనంత ఎత్తుకు ఎదుగుతున్న కొడుకును చూసి ఏ తండ్రైనా ఉప్పొంగిపోతాడు. అతను తన పేరును నిలబెట్టేలా మంచి పనులు చేస్తే ఇక ఆ తండ్రి ఆనందానికి అవధులు ఉండవు. టాలీవుడ్ హీరో మహేశ్ బాబు కూడా ఆ స్థాయికి వచ్చారు. 

View this post on Instagram

Height check!! He’s tall♥️♥️ #LockdownShenanigans

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

ఆయన కుమారుడు గౌతం తనంత ఎత్తుకు ఎదిగాడు. ఎత్తులో కాస్త తండ్రికి అటూ ఇటుగా ఉన్నాడు. అయితే మహేశ్ తన కొడుకు హైట్ విషయంలో కొలుచుకుందాం రా అని గౌతం ముందు నిలుచున్నారు., గౌతం నవ్వేస్తూ వెనక్కు వెళ్తుంటే నిలుచోబెట్టి మహేశ్ హైట్ చూశారు. మహేశ్ బాబే, గౌతం కన్నా కాస్త పొడవుగా ఉంటాడని తేలింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మధ్యలో ఆయన కూతురు సితారా కూడా కనువిందు చేస్తుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నిబంధనలతో ఇంట్లోనే ఉంటున్న మహేశ్ బాబు తన పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు. మొన్న మహేశ్  నీటుగా షేవింగ్ చేసుకుని పిల్లలకు అన్నలా పోజు కొట్టిన విషయం తెలిసిందే. తాజా వీడియోపై మహేశ్ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.