టీవీ9లోనే ఉంటా, సాధ్యం కాకపోతే చానల్ పెడతా.. - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ9లోనే ఉంటా, సాధ్యం కాకపోతే చానల్ పెడతా..

May 15, 2019

తాను ఇప్పటికీ టీవీ9 చానల్‌లో షో నిర్వహించాలనుకుంటున్నానని.. కుదరకపోతే మరో చానల్ ప్రారంభిస్తానని వెల్లడించారు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్. కొత్త చానల్ ప్రారంభించి దానిని మొదటి నుంచి అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తంచేశారు. ఫోర్జరీ కేసులో

టీవీ9 మీడియా సంస్థ నుంచి సీఈఓగా రవిప్రకాశ్ తొలగింపునకు గురైన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాలని, లేనిపక్షంలో అరెస్ట్ చేస్తామని తెలంగాణ పోలీసులు నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన ఏపీలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన అత్యవసర విచారణకై హైకోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు చుక్కెదురైంది. కాగా, తాజా పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు.

Let's start another channel .. Ravi Prakash

తానో జర్నలిస్టునని, అసాధ్యమనదగ్గ రీతిలో చానల్‌ను అభివృద్ధి చేశానని తెలిపారు. తమ 15 ఏళ్ల కృషి ఫలితమైన టీవీ9 చానల్ యథాతథంగా ఉంటుందనే ఆశిస్తున్నానని అన్నారు. రామేశ్వర్ రావు ఇప్పుడు టీవీ9 చానల్‌లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని.. అది జరగకూడదని కోరుకుంటున్నానన్నారు.

‘టీవీ9 చానల్‌ను ఏ పార్టీకి కొమ్ముకాయని మీడియా సంస్థగా రూపుదిద్దించాం. ఇతర తెలుగు చానళ్లలాగా టీవీ9 మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను ప్రోత్సహించలేదు. ఎప్పటినుంచో టీవీ9 చానల్‌పై కన్నేసిన ‘మై హోం’ జూపల్లి రామేశ్వర్ రావు, అలంద మీడియా సంస్థ ద్వారా దొడ్డిదారిన ప్రవేశించారు. ఇదంతా కావాలని చేసిన కుట్ర. నాపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలనుకుంటున్నారు’ అని ఆయన ఆరోపించారు.