సిద్దూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. పోస్ట్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

సిద్దూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. పోస్ట్ వైరల్

June 1, 2022

పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలాను తాజాగా గోల్లీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. సిద్దూ హత్యపై మరో రెండు రోజుల్లో ప్రతీకారం తీర్చుకుంటామని మరో గ్యాంగ్‌స్టర్ తెరపైకి రావడం కలకలం రేపుతోంది. సిద్ధూను హత్య చేసింది తమ పనేనని గోల్లీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ తాజాగా మరో గ్యాంగ్‌స్టర్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో పంజాబ్‌ ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.

ఆ పోస్టుతో అప్రమత్తమైన పంజాబీ అధికారులు.. ఆ పోస్ట్‌ను నీరజ్ బాన్నాకు చెందిన ఖాతా నుంచి మంగళవారం పోస్ట్ చేసినట్లు గుర్తించారు. “సిద్దూ నా సోదరుడి లాంటివాడు. అతడి హత్యకు రెండు రోజుల్లో బదులు చెబుతాం” అని హెచ్చరిస్తూ, ఆ పోస్ట్ పెట్టారని అధికారులు తెలిపారు. కానీ, ఆ పోస్ట్‌ను ఎవరు పెట్టారన్నది ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.

మరోపక్క సిద్ధూను హత్య చేసింది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠానే అని ఇదివరకే పోలీసులు వెల్లడించారు. సిద్ధూ హత్యపై బిష్ణోయ్ సన్నిహితుడు, ముఠా సభ్యుడైన గోల్డ్ బ్రార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంతో పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు. ఇటువంటి సమయంలో సిద్దూ హత్యకు ప్రతీకారం తీర్చుకునే తీరుతాం అంటూ మరో గ్యాంగ్‌స్టర్ సవాల్ విసిరావడంతో పోలీసులు ఆ గ్యాంగ్‌స్టర్ ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే, పంజాబ్‌లో మరో హత్య జరిగేటట్లు సూచనలు కనబడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.