సౌత్ కొరియా టెక్ దిగ్గజం ఎల్జీ మరో సంచలనానికి తెర లేపింది. ప్రపంచంలో మొట్టమొదటి రోలింగ్ టీవీని లాంచ్ చేసింది. 2018లో ఎల్జీ ఈ టీవీ గురించి మొదటిసారి ప్రకటించింది. 2019లో ఈ టీవిని మార్కెట్లోకి తెస్తామని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకొచ్చింది. 65 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వచ్చిన ఈ టీవీ ధరను దక్షిణకొరియాలో 10,00,00,000 వాన్‌లుగా నిర్ణయించారు. మన దేశ కరెన్సీలో ఈ టీవీ ధర సుమారు రూ.63,84,000 ఉండనుంది. ప్రస్తుతం ఈ టీవీ సేల్స్ దక్షిణ కొరియాలో ప్రారంభం అయ్యాయి.
LG’s rollable TV finally goes on sale for $87,000 https://t.co/krRNkYzIPX pic.twitter.com/wC3KssdRfF
— The Verge (@verge) October 20, 2020
ఈ టీవీ కింద మీకు కనిపించే అల్యూమినియం బేస్‌లోకి దీన్ని రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం 10 సెకన్లలోపే ఈ టీవీని బేస్‌లోకి రోల్ అవుతుంది. ఇందులో ఉండే లైన్ వ్యూని ఎంచుకుంటే మొత్తం డిస్ ప్లే బయటకు రాకుండా టీవీలో కొంత భాగం మాత్రమే బయటకు వస్తుంది. ఫ్రేమ్, మూడ్, హోం డ్యాష్ బోర్డ్, మ్యూజిక్, క్లాక్ మోడ్స్‌ను ఎంచుకుంటే దానికి తగ్గట్లు టీవీ వ్యూ మారుతుంది. ఫుల్ వ్యూని ఎంచుకుంటే టీవీ స్క్రీన్ మొత్తం బయటకు వస్తుంది. ఈ ఎల్జీ ఓఎల్ఈడీ టీవీ ద్వారా యాపిల్ హోం కిట్ డివైసెస్‌ను నియంత్రించవచ్చు. ఈ టీవిలో గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ టీవీలో ఇండియాలో ఎప్పుడు వస్తుందనేది ఎల్జీ ప్రకటించలేదు.