కత్తిలాంటి స్క్రీన్.. మడతపెట్టి ఒరలో దాచేయొచ్చు..  - MicTv.in - Telugu News
mictv telugu

కత్తిలాంటి స్క్రీన్.. మడతపెట్టి ఒరలో దాచేయొచ్చు.. 

September 12, 2019

మొబైల్ ఫోన్ సాంకేతికత రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్‌ఫోన్ హవా కొనసాగుతున్న తరుణంలో శాంసంగ్, రెడీమి మొబైల్ తయారీ సంస్థలన్నీ ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో మరో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన ఎల్‌జీ కంపెనీ ఒక్కడుకు ముందుకేసి రోలబుల్ (మడత చుట్టే) ఫోన్లపై పరిశోధనలు చేస్తోంది. తక్కువ స్పేస్‌లోనే పెద్ద స్క్రీన్‌ ఇమిడ్చే సదుపాయం ఉంది కాబట్టి ఇది ఫోల్డబుల్‌ ఫోన్స్‌లోనే మరో విప్లవాత్మక ఆవిష్కరణగా పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈ ఫోన్‌లో స్క్రీన్ మొత్తం చుట్ట చుట్టుకుని ఉంటుందన్నమాట. అవసరం ఉన్నప్పుడు బయటికి లాగి పనైపోయాక మళ్ళీ లోపలి చుట్టేయవచ్చు. ఒరలో కత్తిని దాచినట్టు స్క్రీన్‌ని చుట్టచుట్టి ఫోన్‌లోనే దాచేయవచ్చు. ఈ ఫోన్‌ డిజైన్‌ తాజాగా బయటికి వచ్చింది. ఇది చూడడానికి ఒక చిన్న చాక్లెట్ బార్‌లా ఉంది. ఇందులోంచి పక్క నుంచి స్క్రీన్ బయటకు వస్తుంది. ఫోన్‌పై ఎక్కడా బటన్లూ, స్విచ్‌లు కనిపించకపోవడం గమనార్హం. ఈ రోల్‌ స్క్రీన్ మోడల్ పూర్తిగా మ్యాగ్నెటిక్ డిజైన్ అని చెబుతున్నారు. చూడగానే ఆకర్షించే డిజైన్ భవిష్యత్తులో పెద్ద సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది.