సౌత్ కొరియా టెక్ దిగ్గజం ఎల్జీ.. వింగ్, వెల్వెట్ పేర్లతో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎల్జీ వింగ్ స్మార్ట్‌ఫోన్ ఇల్యూషన్ స్కై, అరోరా గ్రే కలర్లలో లభ్యం కానున్నాయి. ఈ ఫోన్ ధర రూ.69,990గా నిర్ణయించారు. నవంబర్ 9 నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్ లభ్యం కానుంది. అలాగే ఎల్జీ వెల్వెట్ 4జి స్మార్ట్ ఫోన్ ధర రూ.36,990గా నిర్ణయించారు. దీన్ని అక్టోబర్ 30 నుంచి విక్రయిస్తారు.
ఎల్జీ వింగ్ ఫీచర్లు
* 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్,
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్,
* 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
* ఆండ్రాయిడ్ 10,
* 64+13+12 మెగాపిక్సల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్,
* 32 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఎల్జీ వెల్వెట్ 4జి ఫీచర్లు
* 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే,
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,
* 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
* ఆండ్రాయిడ్ 10,
* 48+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్,
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
* 4300 ఎంఏహెచ్ బ్యాటరీ.