ఆదానీ కంపెనీల షేర్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఆదానీ గ్రూప్ భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించడంతో గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లను జనం వదిలించుకుంటున్నారు. ప్రజలే కాక, భారీ ఎత్తున వాటిని కొన్న కంపెనీలు కూడా భారీ నష్టం చవిచూస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీకి పూడ్చుకోవడం సాధ్యం కానంత నష్టం వాటిల్లింది. ఆదానీ షేర్ల పతనం వల్ల బీమా సంస్థకు రెండు రోజుల్లో రూ. 16,580 కోట్లు కోల్పోయింది.
నష్టాలు ఇలా..
ఆదానీ గ్రూపులో ఒకటైన ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్ఐసీకి 4.8 కోట్ల షేర్లు ఉన్నాయి. షేర్ ధర రూ. 3442 నుంచి రూ. 2768కి పడిపోవడంతో రూ. 3,245 కోట్ల నష్టం చవిచూసింది. ఆదానీ స్పోర్ట్స్ షేర్ ధర రూ. 761 నుంచి రూ. 604కు పతనం కావడంతో రూ. 3095 కోట్ల నష్టం వాటిల్లింది. ఆదానీ ట్రాన్స్‌మిషన్స్‌లో రూ.3042 కోట్లు, ఆదానీ గ్రీన్ కంపెనీలో రూ. 875 కోట్లు, ఆదానీ టోటల్ గ్యాస్ లో రూ. 6323 కోట్ల నష్టాన్ని ఎల్ఐసీ చవిచూసింది. ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయాలని మోదీ ప్రభుత్వం యత్నిస్తున్న నేపథ్యంలో కంపెనీ సంపద హారతి కర్పూరంలా కరిగిపోవడంపై వాటాదారులు, పాలసీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి, కంపెనీ పెట్టుబడుల విధానంపై ప్రజల్లో మళ్లీ నమ్మకం కలిగించడానికి కంపెనీకి చాలా కాలం పడుతుందని విశ్లేషకుల అంచనా.
ఇవి కూడా చదవండి :
BSNL : రూ. 99కే ఏడాది వాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
ఈ నెల 30,31 తేదీలో యథావిధిగా బ్యాంక్ సేవలు..సమ్మె నిర్ణయం వాయిదా