ఎల్ఐసీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,394 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ కేంద్రంగా పలు డివిజిన్లలో పనిచేసేందుకు 1,408 అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోస్టులను ప్రకటించింది.
జీతం రూ. 51,500:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21ఏళ్ల నుంచి 30ఏళ్ల వయస్సు ఉండాలి. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,500 వేతనంగా అందిస్తారు. ఒక ఏడాది ప్రోబేషన్ పిరియడ్ ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైటులో 21 జనవరి 2023 నుంచి 10 ఫిబ్రవరి 2023లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
తూర్పు జోనల్ 1049, వెస్ట్రన్ జోనల్ 1942, ఉత్తర జోనల్ 1216, ఈస్ట్ సెంట్రల్ జోనల్ 669, నార్త్ సెంట్రల్ జోనల్ 1033, సౌత్ జోనల్ 1408, సెంట్రల్ జోనల్ 651 పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కడప, మచిలీపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విశాఖ జిల్లాలు ఉండగా…తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంగనర్ జిల్లాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:
ఏదైనాగుర్తింప కలిగిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 01జనవరి 2023 నాటికి 21ఏళ్ల పై బడి 30ఏళ్లలోపుఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎల్ఐసీ ఉద్యోగమెంబర్ లకు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 100, మిగిలివారికి రూ. 750 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ మూడుదశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరిగా ఉంటుంది.