బైక్‌పై వెళ్తుంటే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వాలు ఇప్పటికే చట్టాలు తీసుకువచ్చాయి. ఎవరైనా ఉల్లంఘించారంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశ్యంతో వాహనదారులకు వాతలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బైక్‌పై వెళ్తున్న వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఆదేశించింది. లేకపోతే మూడు నెలల పాటు లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తామని పేర్కొంది. తాజా ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది.
మోటార్ వాహన చట్టం కింద ఈ నిబంధన తీసుకువచ్చారు. ఈ నిబంధనల్లో బైక్‌పై ఉన్నవారంతా తప్పనిసరిగా హెల్మెంట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ కోల్పోకుండా ఉండాలంటే నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. దీంతో పాటు రూ. 1000 జరిమానా కూడా ఉంటుందని పేర్కొన్నారు. తాజా ఉత్తర్వులతో ఇక నుంచి బైక్‌పై వెళ్తున్నవారు జాగ్రత్త పాటించక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.