జీవిత బీమా.. ఇస్లాంకు విరుద్ధం - MicTv.in - Telugu News
mictv telugu

జీవిత బీమా.. ఇస్లాంకు విరుద్ధం

February 9, 2018

ఫత్వాలపైన ఫత్వాలు జారే యూపీలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ ఉలేమాలు ఈసారి జీవిత బీమా పాలసీలను టార్గెట్ చేసుకున్నారు. ఈ పాలసీలు ఇస్లామ్‌ మత సిద్ధాంతాలకు విరుద్ధమని  ఫత్వా జారీ చేశారు. వడ్డీ ఇస్లాంకు విరుద్ధమైన నేపథ్యంలో ఆస్తులకు బీమా చేయించడం కూడా మత విరుద్ధమని, చావు పుట్టుకలు అల్లాచేతుల్లో ఉన్నాయని  ప్రకటించారు.‘ముస్లింలు మతానికి కట్టుబడి ఉండాలి. అల్లాపై భక్తి ప్రపత్తులు చూపాలి. అంతేకాని  బీమా కంపెనీలను ఆరాధించడం సరికాదు..’ అని చెప్పుకొచ్చారు. బీమా అల్లాకు సమ్మతమేనా అని ఘజియాబాద్‌ నివాసి ఒకరు అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తూ ఈమేరకు ఫత్వా జారీ చేశారు. ‘చావు, బతుకులు అల్లా చేతుల్లో ఉన్నాయి..  బీమా కంపెనీలేవీ వ్యక్తి ఆయుష్షుకు హామీ ఇవ్వలేవు.. బీమా కంపెనీలు ప్రజలు తమ వద్ద దాచిన డబ్బులను పెట్టుబడుగా పెట్టి వడ్డీ ఆర్జిస్తున్నాయి.. వడ్డీ ద్వారా పొందే ఆదాయం మన మతానికి వ్యతిరేకం.. ’ అని పేర్కొన్నారు.