ఎమ్మెల్సీ కొడుక్కు జీవితఖైదు - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్సీ కొడుక్కు జీవితఖైదు

September 6, 2017

చట్టానికి ఎవరూ అతీతులు కాదు. నేరం చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందే. ఓ ఇంటర్ విద్యార్థిని కాల్చి చంపిన కేసులో బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాఖీ యాదవ్ కు, మరో ఇద్దరికీ  కోర్టు బుధవారం యావజ్జీవ జైలు శిక్ష విధించింది. రాఖీ తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ కేసులో వీరిని ఇటీవలే దోషులుగా  తేల్చింది కోర్టు. . తీర్పుపై అదిత్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది మే నెలలో తన ఎస్వీయూ వాహనాన్ని దాటివెళ్లాడనే అక్కసుతో రాఖీ.. గయకు చెందిన వ్యాపారి కొడుకు ఆదిత్య సచ్ దేవ్ ను తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత గయకు పారిపోయిన తన తండ్రికి చెందిన ఫ్యాక్టరీ తలదాచుకున్నాడు. రెండు రోజుల తర్వాత పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.