శతాయుష్మాన్ భవ.. పిల్లపాపలతో నిండు నూరేళ్లు పచ్చగా జీవించండి.. ఈ దీవెనలను ఎన్నోసార్లు వినుంటాం. కానీ అసలు మనిషి అసలు సిసలు జీవిత కాలం కేవలం 38 ఏళ్లు మాత్రమే అని శాస్త్రవేత్తలు షాకింగ్ విషయం ఒకటి చెప్పేశారు. జీవజాలం డీఎన్ఏ ఆధారంగా ఈ సంగతి తేల్చారు. అరే ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఎంత ఆశ్చర్యపోయినా నిజం ఇదే. కొందరు నూరేళ్లు, కొందరు 120 ఏళ్లు కూడా నిక్షేపంగా బతికేస్తున్న ఈ కాలంలో మనిషి బతుకు 38 ఏళ్లే అని శాస్త్రీయంగా రుజువైంది.
మనిషితోపాటు వివిధ క్షేరదాలు, చేపలు, పక్షులపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయోగం నిర్వహించారు. భూమిపై తిరిగిన ప్రాచీన మానవ జాతి మొదలుకుని ఆధునిక మానవ జాతుల వరకు ఉన్న డీఎన్ఏ డేటాను పరిశీలించారు. ‘మనిషి సహజసిద్ధ ఆయుర్దాయం కేవలం 38 ఏళ్లు మాత్రమే. అయితే శతాబ్దాలుగా మానవ జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఆహారంల, చికిత్సలు, ఔషధాల కారణంగా వయసు పెరుగుతోంది. డీఎన్ఏలో జరిగే మిథైలేషన్ అనే మార్పు వెన్నెముక జీవుల్లో ఆయుర్దాయాన్ని నిర్ధారిస్తుంది.. నియాండర్తల్, డినిసోవియన్ మానవుల గరిష్టంగా కేవలం 37.8 ఏళ్లు మాత్రమే బతికారు’ అని అధ్యయనంలో పాల్గొన్న బెన్ మేన్ వెల్లడించారు. ప్రాణుల్లో జన్యువులు ఎప్పుడు నిర్జీవం అవుతాయనే జన్యు గడియారాన్ని బట్టి ఉటుందని, 42 జన్యువుల్లో డీఎన్ఏ మిథైలేషన్ డేటా ఆధారంగా ఆయుర్దాయాన్ని కచ్చితంగా అంచనా వేయొచ్చని తెలిపారు.
సరే, ఈ భూమిపై జీవుల్లో దేని ఆయుర్దాయం ఎంతో తెలుసుకుందామా..
మనిషి జీవితకాలం 38 ఏళ్లు
బోహెడ్ జీవితకాలం తిమింగలం 268 ఏళ్లు
అంతరించిపోయిన వూలీ మామత్ అనే భారీ ఏనుగు జీవిత కాలం 60 ఏళ్లు
పింటా ఐలాండ్ తాబేలు 120 ఏళ్లు
రోగియే రాక్ ఫిష్ 205 ఏళ్లు
కొన్ని ఏనుగులు, తాబేళ్లు, తిమింగళాలు 200, 300 ఏళ్లు కూడా బతికిన దాఖాలు ఉన్నాయి.