వీళ్ల జీవితాల్లో మలినం తొలగేదెప్పుడు ? - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్ల జీవితాల్లో మలినం తొలగేదెప్పుడు ?

September 15, 2017

రోడ్డు పక్కన వెళ్తుంటే  కొంచెం కంపు వాసన రాగానే  ముక్కు మూస్కొని  అక్కడ నుంచి  త్వర త్వరగా వెళ్తుంటాం. కానీ వాళ్ల జీవితాలు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే దాక ఆ కంపులోనే  తెల్లారుతాయి. కంపులో మునిగితే గానే వాళ్ల బతుకులు ముందుకు సాగవు. కంపును ఒంటికి పూసుకుంటే గాని కడుపు నిండని పరిస్ధితి. కంపును భరించి డ్రైనేజిలల్లోకి దిగి  ఇతరులు విసర్జించిన మలినాలను ఎత్తిపోస్తూ మా బతుకులు ఇంతే అని సరిపెట్టుకుంటారు. ఏం చేస్తారు పాపం ఇదేం పని అని చీదరించుకొని చెయ్యక కూర్చుంటే , నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్ధితి వాళ్లది. వీల్లకు ఎన్ని సలాంలు కొట్టినా తక్కువే. అభివృద్ధిలో ఆకాశాన్ని తాకుతున్నాం..టెక్నాలజీలో కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నాం…కానీ డ్రైనేజీలు పరిశుభ్రతకు మాత్రం ఇంకా మనుషులనే నమ్ముకుంటున్నాం. మరి వాళ్ల బ్రతుకులు అలా  కంపులో కొట్టుమిట్టాడాల్సిందేనా. డ్రైనేజీ క్లీనింగ్ కు మనుషులే మార్గమా ? టెక్నాలజీతో డ్రైనేజి వ్యవస్ధను శుభ్రపరచలేమా ?