'Liger' actress Ramya Krishnan is all praise for Shah Rukh Khan
mictv telugu

షారూఖ్ సినిమాలో విలన్‌గా రమ్యకృష్ణ.. స్వీట్ మెమరీస్

August 21, 2022

తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ.. 1986 లో భలేమిత్రులు సినిమాతో తెలుగు వెండి తెరపై అడుగు పెట్టింది. అప్పట్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ… ఆరంభంలో ఎన్నో ఫ్లాప్స్‌ను చూసి, ఐరెన్ లెగ్ నుంచి అదృష్ట దేవతగా మారింది. అప్పట్లో తన గ్లామర్‌తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారినా కూడా నేటి హీరోయిన్లకి దీటుగా ఏ మాత్రం తగ్గని గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. బాహుబలి సినిమాలో శివగామిగా తన నట విశ్వరూపం చూపించింది.

ఇప్పడు లైగర్‌ సినిమాలో విజయ్‌ దేవర కొండకు తల్లిగా నటించింది. అయితే లైగర్‌ సినిమా ఆగస్టు 25న రిలీజ్‌ డేట్ దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. బాలీవుడ్‌ మీడియా అక్కడి స్టార్లతో నటించిన చిత్రాలపై ప్రశ్నించగా.. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ గురించి ఆమెచెప్పిన మాటలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా అయ్యాయి. 1996లో చాహత్‌ లో షారుక్‌ తో నటించిన సినిమా గురించి చెపుతూ గతస్మృతులు గుర్తుచేసుకుంది. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సంస్కారం తెలిసిన వ్యక్తి అని కొనియాడింది. చుట్టూ ఉన్నవారిని తన ప్రవర్తనతో ఆకట్టుకుంటాడని, అతనొక స్వీట్ హార్ట్ అని చెప్పింది. ‘చాహత్’లో తాను విలన్ గా చేసినట్లు గుర్తుచేసుకుంది. అప్పుడు చాలా సహాయం చేశాడని తెలిపింది. అతను రణ్ వీర్ సింగ్ గా ఫుల్ ఎనర్జీతో ఉంటాడని పేర్కొంది.