'Liger' in 'Acharya' list...5th day collections are these..
mictv telugu

‘ఆచార్య’ లిస్ట్‌లోకి ‘లైగర్’..5వ రోజు కలెక్షన్లు ఇవే..

August 30, 2022

'Liger' in 'Acharya' list...5th day collections are these..

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రికార్డులను తిరగరాసి..డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్ పేరు సంపదించుకున్నారు. అయన డైరెక్షన్‌లో కొత్త సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే పండగ. అలాంటిది తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వాళ్లు, అటు విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ, ‘లైగర్’ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశలకు గురి చేసింది.

ఈ క్రమంలో ‘లైగర్’..తెలుగు భాషతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. అయితే, సినిమా విడుదలై, ఈరోజుతో ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఏ రాష్ట్రంలో ఎంతెంత కలెక్షన్లు రాబట్టిందో మేకర్స్ వివరాలను వెల్లడించారు. ”ఆంధ్ర, తెలంగాణలో కలిపి రూ. 62 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక, కర్నాటకలో రూ. 5.20 కోట్లు, తమిళనాడులో రూ. 2.50 కోట్లు, కేరళలో రూ. 1.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ చేసింది.”

అంతేకాదు, ‘లైగర్’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు వసూళ్లు మరింత దారుణంగా తగ్గాయి. మొదటిరోజు 9.57 కోట్లు అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత రెండవ రోజు కేవలం 1.54 కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. ఇక, మూడవరోజు కోటి రూపాయల షేర్, నాలుగో రోజు 58 లక్షల షేర్ రాగా 5వ రోజు మాత్రం మరింత దారుణంగా కేవలం 12 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.

అయితే, ఈ ‘లైగర్’ సినిమాకు ఐదు రోజుల్లో వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే, ఇటీవలే మెగస్టార్ చిరంజీవి హీరోగా, రాంచరణ్ కీలకపాత్రలో నటించిన ‘ఆచార్య’ సినిమా నష్టాల లిస్ట్‌లో చేరిందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. లైగర్, ఆచార్య సినిమా తరువాత ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా సినిమా 30 కోట్ల షేర్ అందుకుంటుందా లేదా అనేది కూడా అనుమనంగానే ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.