లైగర్ టీజర్ డేట్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

లైగర్ టీజర్ డేట్ వచ్చేసింది

May 4, 2022

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. సాలా క్రాస్ బీడ్ అనేది క్యాప్షన్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ విజయ్ తండ్రిగా నటిస్తున్నాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందిస్తున్నారు. సంచలన కాంబోలో వస్తున్న ఈ చిత్రం టీజర్ ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 200 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ చేసిందని టాక్.