పిడుగుల బీభత్సం..ఒక్కరోజే 23 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పిడుగుల బీభత్సం..ఒక్కరోజే 23 మంది మృతి

July 5, 2020

bc bv b

ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఉరుములు, పిడుగులతో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు వణికిపోయారు. బీహార్ లో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడ శనివారం పలు చోట్ల పిడుగులు పడటంతో ఏకంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.

రాష్ట్రంలోని మొత్తం ఐదు జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. అత్యధికంగా భోజ్ పూర్ జిల్లాలో 9 మంది చనిపోయారు. మారిన వాతావరణ పరిస్థితుల పట్ల సీఎం నితీశ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేశారు. కాగా, బీహార్ లో ప్రస్తుత పరిస్థితికి వాతావరణ మార్పులే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు వారాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 150 మంది వరకు మరణించారు.