HYD విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

HYD విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి

May 4, 2022

హైదరాబాదులో బుధవారం తెల్లవారు ఝామున కురిసిన వర్షానికి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగింది. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో పలు చోట్ల చెట్లపై విద్యుత్ స్తంభాలు కూలాయి. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో దక్షిణ డిస్కం సీఎండీ రఘుమా రెడ్డి అత్యవసరంగా అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చెట్లు, వాహనాల మీద స్తంభాలు పడ్డా, రోడ్ల మీద నిలిచిన నీటితో విద్యుత్ వైర్లు తెగిపడినా వాటిని ముట్టుకోకూడదని అన్నారు. ఎమర్జెన్సీ అవసరాలుంటే 1912 లేదా 100 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అంతేకాక, 7382072104, 7382072106, 7382071574 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.