పాన్ - ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా! - MicTv.in - Telugu News
mictv telugu

పాన్ – ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా!

March 30, 2022

4

పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి మార్చి 31వరకు ఆదాయ పన్ను శాఖ గడవు విధించింది. అప్పటివరక గనక లింక్ చేయకపోతే వినియోగదారుడు అనేక విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది. వాటిని పేర్కొంటూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వాటి ప్రకారం.. ఏప్రిల్ నుంచి మూడునెలలు అంటే జూన్ నెల వరకు అనుసంధానించుకుంటే రూ. 500 జరిమానా విధిస్తారు. అప్పటికీ లింక్ చేసుకోకపోతే రూ. 1000 వసూలు చేస్తారు. ఈవిధంగా జరిమానా విధించేందుకు సెక్షన్ 234 హెచ్ ప్రకారం కేంద్రం అధికారం ఇచ్చింది. జరిమానా కట్టడమే కాకుండా అనేక విధాలుగా కూడా వినియోగదారుడు నష్టపోతాడు. పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ అయిపోతుంది. ఇలా అయిపోతే ఆర్ధిక లావాదేవీలు సాధ్యపడవు. బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతుంది. పాన్ కార్డు ఆక్టివ్‌గా లేకపోతే అదనంగా రూ. 10,000 జరిమానా విధిస్తారు. ఇందుకు సెక్షన్ 272 బి అధికారం కల్పిస్తుంది. సో, వీటన్నింటినీ నిరోధించాలంటే పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడం ఉత్తమం.