mictv telugu

విషాదం.. సముద్రంలో కుప్పకూలిన విమానం….188 మంది గల్లంతు

October 29, 2018

విమాన ప్రమాదాలకు కేంద్ర బిందువైన ఇండోనేషియాలో మరో ప్రమాదం జరిగింది. ఇండోనేషియా సముద్రంలో  లియాన్ విమానయాన సంస్థకు చెందిన ‘జేటీ610’ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 188 మంది ప్రయాణికులు ఉన్నారు. సోమవారం ఉదయం 6. 21  నిమిషాలకు ఇండోనేషియా రాజధాని జకర్తాలోని టాంగేరాంగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి పంగ్ కల్ పినాంగ్‌కు బయలుదేరింది. ఉదయం 7:30 గంటకు పంగ్ కల్ పినాంగ్ చేరుకోవాలి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు  తెగిపోయాయి. ఈ విషయాన్ని ఇండోనేషియా నేషనల్ సెర్చ్ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది.

Lion Air flight loses contact, search in Indonesian seas..about 6.20 a.m. for Pangkal Pinang on an island chain off Sumatra

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో ఎవరైనా బతికారా అనే విషయం తెలియరాలేదు. ప్రయాణికుల్లో 178 మంది పెద్దలు, ఓ చిన్నారి, ఇద్దరు బేబీలు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు.