కారులో షికారు సింహం ! - MicTv.in - Telugu News
mictv telugu

కారులో షికారు సింహం !

June 17, 2017

https://www.youtube.com/watch?v=Oxc1flyAiIs

పాముకు పాలు పోసి పెంచినా కాటెయ్యక మానదు, సింహానికి బొక్కేసి పెంచినా మన పిక్క లాగదని గ్యారెంటీ లేదు. పిక్కేంటి పీకే కొరికేసి పరపర నమిలే సింహాన్ని ఒక మోతెబరి కార్ బ్యాకులో కూర్చుండబెట్టి దర్జాగా దాన్ని హవాఖోరీకి తీస్కెళ్ళినట్టు కారులో షికారుకి తిప్పాడు. అదెక్కడో అడవిలో కాదు సుమా.. కరాచీ సిటీ రోడ్ల పైన. అదీ ఫుల్లుగా జన సంచారం వున్న రోడ్లపై.. ఇంకా నయం నా సింహంతో సెల్ఫీ దిగినవారికి దానితో నైటు డిన్నర్, ఒక రోజు మొత్తం స్పెండ్ చేసే ఛాన్స్ ఇస్తానని అనలేదు ! ? వామ్మో.. దాని పంజా గులగుల పెట్టినా, కోరలు కిర్రుమని రక్త దాహాన్ని కోరుకుంటే దాని ప్రతాపం మనుషుల మీదే.. అంతమంది తిరిగే జన సంచారం మధ్యన సింహం కార్లో దర్జాగా తిరగటంతో జనాలు బెంబేలెత్తిపోయారు. ఇది గమనించిన పోలీసులు ఆ సింహం యజమాని జావెద్ ను అరెస్టు చేసారు.
అదేమైనా పిల్లా, కుక్కనా ? మనుషుల మధ్య తిప్పటానికని వార్నింగులిచ్చి జరీమానా విధించారట. సింహాలను ఇలా పెంచుకుంటే మీ ప్రాణాలక్కూడా ప్రమాదమని గ్రహించండని చెబితే… దానికతను అదస్సలు ఎవ్వర్ని ఏమీ అనని సాధు జంతువు అని సమర్ధించుకోవాలని చూసాడంట. పోలీసులు గుర్రై దాన్ని జూకి అప్పజెప్పుదామంటే యజమాని అస్సలు ఒప్పుకోలేదట. కొంత సేపటికే బెయిల్ రాగానే మనోడు ఎంచక్కా బయటికొచ్చేసాడు. అయితే ఇంకెప్పుడూ సింహాన్ని బయటకు తీసుకురావద్దని గట్టిగా షరతు విధించి పంపించారు పోలీసులు. చూసారా జనాలు రాను రాను ఎంత వెర్రెక్కిపోతున్నారో.. ఈ మధ్య అరబ్ దేశాల్లో క్రూర మృగాలను మచ్చిక చేస్కోవడం ప్రిస్టేజ్ అయిపోయింది మరి !