పెంపుడు జంతువుల బొచ్చును నానా రకాలుగా కత్తిరించి మురిసిపోతుంటారు యజమానులు. కుక్క, పిల్లి వంటి జంతువులకు అందాల పోటీలు కూడా మామూలే. కానీ క్రూరమృగాలకు సోకులు చేసిన ముచ్చట్లు మనకు తెలీదు. ఒకరు చేయడం కాదు, తానే సోకులు చేసుకుని మృగాలు గురించి అసలు తెలీదు. ఈ కొరత తీర్చడానికా అన్నట్లు ఓ మగ సింహం సోకులతో జనాన్ని పిచ్చిక్కిస్తోంది.
చైనాలోని గాంజౌ జూలో ఉన్న ఈ మృగరాజు పేరు హాంగ్ హంగ్. దీన్ని చూడ్డానికి జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీన్ని ముఖంపై వేలాడే జుట్టు చక్కగా కత్తిరించి దువ్వినట్టు ఉండడే దీని స్పెషల్. జనాన్ని ఆకర్షించడానికి జూ కీపర్లు ఈ సోకు చేశారనుకుంటే తప్పులో కాలేసినట్టే. హాంగ్ హాంగ్ స్వయంగా దువ్వుకుంటుంది. గాంజౌలో ఉష్ణోగ్రత ఎక్కువ కావడం, గాలిలో తేమ మోతాదు ఎక్కువ కావడం వల్ల అది పంజాలను మాటిమాటికీ నాకుతూ, ఆ తడి పంజాలతో తలను దువ్వుకుంటూ ఉంది. దీంతో దాని జట్టు దువ్వినట్లు వేలాడుతూ ఉంటుంది. పైగా హాంగ్ హాంగ్ బొచ్చు రంగు మిగతా సింహాలకంటే కాస్త తెల్లగా ఉండడంతో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. దీని హెయిర్ కటింగ్ 1990ల నాటి ములెట్ హెయిర్ స్టయిల్‌ను గుర్తుకు తెస్తోంది.
lion with a mullet! Hang Hang china zoo visitors Guangzhou