ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్‌లో అర్జెంటీనా.. ఫ్రాన్స్‌పై గెలిచి సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో కొత్త వివాదమొకటి తెరపైకి వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు స్టార్ ప్లేయర్ లియొనెల్ మెస్సి చేసిన రెండో గోల్ ఈ వివాదానికి కేంద్రంగా మారింది. మెస్సీ నిబంధనలకు విరుద్ధంగా రెండో గోల్ చేశాడని.. ఆ గోల్‌ను రెఫరీ ఎలా అనుమతించిందంటూ ఫ్రాన్స్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రెఫరీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ అదనపు సమయంలో 108వ నిమిషంలో మార్టినెజ్ కొట్టిన బంతి ఫ్రాన్స్ గోల్ కీపర్ హుగో లోరిస్‌ను తాకి వెనక్కు వచ్చింది. వెంటనే మెస్సి దానిని కుడికాలితో కొట్టి గోల్‌లైన్ దాటించేశాడు. దీంతో అర్జెంటీనాకు 3-2 ఆధిక్యం లభించింది. కానీ మెస్సి గోల్ కొట్టే సమయంలో అర్జెంటీనాకు చెందిన రిజర్వు ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. అప్పటికి బంతి గోల్ లైన్ దాటలేదు. ఫిఫా రూల్స్ ప్రకారం గోల్ చేసే సమయంలో అదనపు వ్యక్తులు( గోల్ చేసిన జట్టు ఆటగాళ్లు, సబ్స్టిట్యూట్లు, అధికారులు) మైదానంలో ఉంటే గోల్‌ను రెఫరీలు అనుమతించకూడదు. కానీ అనుమతించారు.
అందుకు కారణం ప్రపంచకప్ ఫైనల్స్‌లో రెఫరీ సైమన్ మార్సినెక్ ఆటను చూడటంలో నిమగ్నం కావడంతో ఈ విషయాన్ని గుర్తించలేదని చెబుతున్నారు. మరో వైపు మ్యాచ్ అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదని యూరోస్పోర్ట్స్ అనే పత్రిక పేర్కొంది. ఈ అంశంపై ఫ్రాన్స్ తమ ఫిర్యాదును నమోదు చేయొచ్చు. కానీ, ఫలితాన్ని మాత్రం మార్చలేదు.
ఇవి కూడా చదవండి :
రిటైర్మెంట్ ప్రకటించిన ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్లేయర్
కప్పు గెలిచిన అర్జెంటీనా.. అభిమానంతో 1500 మందికి ఫ్రీ చికెన్ బిర్యానీ