టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివాకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపించాడు.అది చూసిన జీవా ఆనందంతో మురిసిపోయింది. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌ను ఇష్టపడే జీవా..మెస్సీకి పెద్ద ఫ్యాన్ అంట. దీంతో అభిమాన ఆటగాడి నుంచి జెర్సీ రూపంలో గిఫ్ట్ రాగానే ఉబ్బితబ్బిపోయింది. మెస్సీ జెర్సీని వేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది. ధోనితో పాటు జీవా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుందన్న సంగతి తెలిసింది. జీవాబుజ్జి బుజ్జి మాటలు, పాటలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి.
ఫిఫా-2022 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మెస్సీ ఆటను చూసి ఫిదా అవతారు. తమ అభిమాన ఆటగాడు అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించడంతో ప్రపంచ వ్యాప్తంగా మెస్సీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.