Lionel Messi Narrowly Escapes Horrific Accident With Argentine Teammates During World Cup Victory Bus Parade
mictv telugu

మెస్సీ జట్టుకు తప్పిన పెను ప్రమాదం..

December 21, 2022

36 సంవత్సరాలు తర్వాత అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్ కప్ గెలవడంతో స్వదేశంలో పండగ వాతావరణం నెలకొంది. అర్జెంటీనా దేశం మొత్తం సంబరాలు అంబరాన్నంటాయి. కప్పుతో మంగళవారం దేశానికి తిరిగొచ్చిన మెస్సీ జట్టుకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. లక్షలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకుని సందడి చేశారు. మెస్సీ బృందం బ్యూనోస్ ఎయిర్స్ చేరుకోగానే అభిమానులు నినాదాలు హోరెత్తాయి.

అర్జెంటీనా టీమ్ ఎయిర్ పోర్టులో దిగగానే, వరల్డ్ చాంపియన్స్ అని రాసున్న బస్సులో వారిని తరలించారు. ఓపెన్ టాప్ బస్సులో నగరానికి పరేడ్‎గా వెళ్లారు. బస్సు పైకి ఎక్కిన ప్లేయర్స్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆటగాళ్లకు అడుగడగునా నీరాజనాలు పలికారు. అయితే ఈ క్రమంలో మెస్సీ జట్టుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మెస్సీతో పాటు రొడ్రిగో డి పాల్, నికోలస్ ఒటామెండి, లియాండ్రో పరేడ్స్, ఏంజిల్ డి మారియా బస్సుపై కూర్చొని వెళ్తుండగా వారికి ఓ కరెంట్ వైర్ అడ్డొచ్చింది. దీనిని గమనించి వారు వెంటనే అప్రమత్తమై కిందకు వంగడంతో ప్రమాదం తప్పింది.

మరోవైపు అభిమానం శృతి మించడంతో ఆటగాళ్లకు తలనొప్పిగా మారింది. ఆటగాళు ప్రయాణిస్తున్న బస్సులోకి కొంతమంది ఫ్యాన్స్ వంతెన పై నుంచి దూకారు. మరికొందరు బస్సులోకి వెల్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సు కూడా ముందుకు కదలడానికి ఇబ్బందిగా మారడంతో మెస్సీ బృందాన్ని అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఫుట్ బాల్ సంఘం ప్రధాన కార్యాలయానికి తరలించారు.