మెస్సీ కప్పు క్రేజీ..ఎప్పుడూ దాంతోనే..
ప్రతీ క్రీడాకారుడి కల వరల్డ్ కప్. క్రికెట్, ఫుట్ బాల్, హాకీ వంటి ఏ ఆటలోనైనా వరల్డ్ కప్ సాధించాలని ప్రతీ ఆటగాడు భావిస్తాడు. కెరీర్లో ఎన్ని రికార్డులు సాధించినా..అద్భుతాలు సృష్టించినా..వరల్డ్‌కప్ లేకపోతే మాత్రం లోటుగానే ఉంటుంది. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైదానంలో పరుగుల వరద పారించినా..తన కెరీర్లో వరల్డ్ కప్ కోసం ఎదురు చూసాడు. చివరికి 2011లో భారత్ వరల్డ్ కప్ సాధించడంతో ఆ కోరిక నెరవేరింది.
ఫుట్బాల్లోను దిగ్గజ ఆటగాడు మెస్సీ కెరీర్లో వరల్డ్ కప్ లేకపోవడం ఇన్ని రోజులు నిరాశ చెందాడు. తన పేరిట ఎన్ని రికార్డులున్నా..అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించాలని ఆశగా ఎదురు చూశాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. చివరికి 2022లో కోరిక అనుకున్నది సాధించాడు. టోర్నీలోని ప్రతీ మ్యాచ్‌లోనూ మ్యాజిక్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఫైనల్లో తనలో ఉన్న నైపుణ్యాన్ని మొత్తం బయటకు తీసి అందని ద్రాక్షలా ఉన్నా వరల్డ్ కప్‌ను ముద్దాడాడు.ఈ సమయంలో మెస్సీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరకాల కోరిక తీరడంతో మెస్సీ సంతోషంలో మునిగితేలుతున్నాడు.
కల నిజం కావడంతో సాధించిన వరల్డ్ కప్‌ను అస్సలు మెస్సీ వదలడం లేదు. ప్రతి క్షణం కప్పుతోనే కాలక్షేపం చేస్తున్నాడు. కప్పును చూస్తూ మురిసిపోతున్నాడు. చివరికి ఫిఫా వరల్డ్ కప్‌తోనే తన బెడ్‌పై మెస్సీ నిద్రిస్తుండడం విశేషం. మళ్లీ లేవగానే కప్పును చూస్తున్నాడు.
ఆహారం తీసుకున్నప్పుడు, డ్రింక్ తాగినప్పుడు కూడా కనీసం అతడు కప్పును పక్కనపెట్టడం లేదంటే అతడు దాని కోసం ఎన్ని కలలు కన్నాడో అర్థమవుతుంది. మెస్సీ కప్పుతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.