దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత అర్జెంటీనా జట్టు ఫిఫా ప్రపంచకప్ విశ్వ విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి. దీంతో ప్రపంచకప్‌ను ముద్దాడాలనే అతడి కల తీరింది. ప్రస్తుతం మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. కల నిజం కావడంతో సాధించిన వరల్డ్ కప్‌ను అస్సలు వదలడం లేదు. ప్రతి క్షణం కప్పుతోనే కాలక్షేపం చేస్తున్నాడు. కప్పును చూస్తూ మురిసిపోతున్నాడు. చివరికి ఫిఫా వరల్డ్ కప్‌తోనే తన బెడ్‌పై మెస్సీ నిద్రిస్తూ, మళ్లీ లేవగానే కప్పును చూస్తున్నాడు. ఆహారం తీసుకున్నప్పుడు, డ్రింక్ తాగినప్పుడు కూడా కనీసం అతడు కప్పును పక్కనపెట్టడం లేదంటే అతడు దాని కోసం ఎన్ని కలలు కన్నాడో అర్థమవుతుంది. అయితే మెస్సీ సంతోషం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
ఈ వరల్డ్‌కప్‌లో అన్నీ తానై జట్టును నడిపించి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్న మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్ గెలిచి ట్రోఫీ అందుకున్న తర్వాత మెస్సీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట పెను సంచలనంగా మారింది. మెస్సీ పోస్టుకు లైకుల కుంభమేళా సాగుతోంది. మెస్సీ పెట్టిన ఈ పోస్టుకు ఇప్పటికే 6 కోట్ల 74 లక్షలకు పైగా నెటిజనులు లైకులు కొట్టారు. లక్షల్లో కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ చరిత్రలో ఇదొక రికార్డు. గతంలో ఒక సెలబ్రిటీ పెట్టిన పోస్టుకు ఇన్ని లైకులు వచ్చిన దాఖలాల్లేవు. మెస్సీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా మెస్సీనే. ఇక రొనాల్డో 517 మిలియన్ ఫాలోవర్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.