ఫిఫా-2022 వరల్డ్ కప్‌ను అర్జెంటీనా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠ బరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఘన విజయం సాదించింది. దిగ్గజ ఆటగాడు మెస్సీ అద్భుతమైన ఆటతో జట్టుకు కప్పును అందించాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రంపచ్ కప్‌ను ముద్దాడాడు. ఫుట్ బాల్ వరల్డ్ కప్‌ను గెలవడంతో అర్జెంటీనా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. స్వదేశానికి చేరిన అర్జెంటీనా జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది ప్రజలు మెస్సీ జట్టు కోసం విమానాశ్రయంలో ఎదురుచూసి వారికి ఘనస్వాగతం పలికారు.
అర్థరాత్రి అని చూడకుండా విమానాశ్రయానికి అభిమానులు పోటెత్తారు.చాలాసేపు అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు రాక కోసం ఎదురు చూశారు. వారు వస్తున్న విమానం కోసం తీవ్రంగా సెర్చ్ చేశారు. విమానం ఎక్కడుంది, ఎంతటైంకి వస్తుందని వెతికారు. ప్లేన్ ట్రాకింగ్ యాప్ సాయంతో ఆ విమానం రాకను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఏకంగా 1.76 లక్షల మంది ఈ యాప్ సాయంతో విమానం ఆప్డేట్ కోసం వెతికారు. చివరికి అర్జెంటీనా కాలమానం ప్రకారం మంగళవారం తెల్లారుజామున 2 గంటలకు మెస్సీ బృందం బ్యూనోస్ ఎయిర్స్ చేరుకుంది.
Gracias 🤩 ⭐️⭐️⭐️🇦🇷🇦🇷🇦🇷 pic.twitter.com/6vdDQiFlWl
— Sir Chandler Blog (@SirChandlerBlog) December 20, 2022
అర్జెంటీనా టీమ్ ఎయిర్ పోర్టులో దిగగానే, వరల్డ్ చాంపియన్స్ అని రాసున్న బస్సులో వారిని తరలించారు. బస్సు పైకి ఎక్కిన ప్లేయర్స్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆటగాళ్లకు అడుగడగునా నీరాజనాలు పలికారు. రోడ్లకిరువైపులా అర్జెంటీనా జాతీయ పతాకాలు పట్టుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ఇక ప్లేయర్స్ ప్రయాణించిన బస్సుపై మూడు స్టార్స్ ఉంచారు. అర్జెంటనీ మూడు వరల్డ్ కప్‌లు సాధించి నందున మూడు స్టార్స్ ఏర్పాటు చేశారు.1978, 1986, 2022 అర్జెంటీనీ వరల్డ్ కప్ సాధించింది.
Scenes: Argentina fans welcoming the World Champions' team bus in Buenos Aires. pic.twitter.com/f20DUWctnE
— FT90Extra (@FT90Extra) December 20, 2022