ఆవుల పిర్రలపై కళ్లు.. క్రూరమృగాలు ఉరుకో ఉరుకు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆవుల పిర్రలపై కళ్లు.. క్రూరమృగాలు ఉరుకో ఉరుకు.. 

August 10, 2020

పొలంలో వేరుశనగ, చెరుకు వంటి పంటలను అడవి పందుల బారినుంచి రక్షించుకోవడానికి కంచెలకు కరెంట్ షాక్ ఇస్తారు. అలాగే కోతులు, కొండముచ్చులు ఊరి మీద పడకుండా ఉండటానికి ఊరి పొలిమేరలో ఓ పెద్దసైజు పులి బొమ్మను ఏర్పాటు చేస్తారు. మరోవైపు పొలాల్లో పక్షుల బారినుంచి జొన్న పంటను రక్షించుకోవడానికి దిష్టి బొమ్మలను పెడతారు. లేదా డప్పు వాయిస్తారు. ఇలా పంటలను రక్షించుకోవడానికి రకరకాల దారులను వెతుకుతుంటారు. అయితే ఆవులను క్రూర మృగాల బారి నుంచి కాపాడుకోవడానికి సదరన్ ఆఫ్రికాలోని ఒకవాంగో డెల్టా ప్రాంతంలో రీసెర్చర్లు ఓ వినూత్న ఐడియాను అవలంభిస్తున్నారు. పశువుల వెనుక భాగంపై కళ్ల గుర్తులను పెయింటింగ్‌గా వేస్తున్నారు. ఆవులపై సింహాలు, హైనాలు, చిరుతలు, పెద్ద పులులు, అడవి కుక్కలు వంటి క్రూర మృగాలు దాడి చేయకుండా ఈ ఐడియాను పాటిస్తున్నారు. రైతుల జీవనాధారాలైన పశువులను కాపాడుకోవడానికి ఇదెంతో మంచి ఉపాయం అని సదరు రీసెర్చర్లు అంటున్నారు. 

ఆ ప్రాంతంలో 80శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంలో ప్రధాన భూమిక పోషించే పశువులను కాపాడుకోవడానికి వారు ఈ ఐడియా ఆలోచించారు. ఆ క్రూర జంతువుల దృష్టి మళ్లించడానికి వారు ఇలా వాటి పిర్రలపై కన్నులను పెయింట్ చేస్తున్నారు. జంతువుల నుంచే కాకుండా.. వేటగాళ్ల నుంచి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అంటున్నారు. వాటిపై పెయింటింగ్స్ చూశాక 50 శాతం వచ్చే చిరుతపులుల్లో 38 శాతం మాత్రమే వస్తున్నాయట.

సింహాలు 25 శాతం తగ్గాయని తెలిపారు. ఈ విషయమై యూఎన్ఎస్‌డబ్ల్యూ సైన్స్ అండ్ తరోంగా వెస్టరన్ ప్లైయిన్స్ జూ రీసెర్చర్ డా.నీల్ జోర్డాన్ మాట్లాడుతూ.. ‘సింహాల నుంచే‌ పశువులకు పెద్ద ప్రమాదం ఉంది. ఇలాపెయింటింగ్ వేయడం వల్ల మరేదో జంతువు అనుకుని అవి తప్పుదారి పడుతున్నాయి. మిగిలిన జంతువుల కంటే కంటి గుర్తు పెయింటింగ్ వేసిన జంతువుల గ్రూప్ ఎక్కువ ‌సేఫ్‌గా ఉంది. ఈ కళ్లు కొత్తగా ఉండేవి కావు. సీతాకోక చిలుకల మీదా.. ఉంటాయి. వేటాడటానికి వచ్చిన జంతువుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో మా పరిశోధన విజయవంతం అయినట్లుగానే అనిపిస్తోంది’ అని వెల్లడించారు.