Home > Featured > ఇళ్ల మధ్యలో సింహాల గుంపు.. వణికిపోయిన జనం ( వీడియో )

ఇళ్ల మధ్యలో సింహాల గుంపు.. వణికిపోయిన జనం ( వీడియో )

అడవుల్లో ఉండాల్సిన సింహాలు జనావాసాల్లోకి వచ్చాయి. గుంపుగా ఒకేసారి ఏడు సింహాలు వచ్చి రోడ్లపై అటూ ఇటు తిరుగుతూ చెక్కర్లు కొట్టాయి. వాటిని చూసిన వారంతా గజగజ వణికిపోయారు. గుజారత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఈ దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృగరాజులు ఇలా రోడ్డుపైకి రావడాన్ని చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

గిరినగర్‌ వీధుల్లోకి గత శుక్రవారం రాత్రి ఏడు సింహాలు వచ్చాయి. ఓ వైపు వర్షం కురుస్తుంటే మరో వైపు సింహాలు ఇళ్ల మధ్యలో వచ్చి తిరగడం ప్రారంభించాయి. అటవీ ప్రాంతానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండటంతో అవి బయటకు వచ్చాయి. వీటిని చూసిన జనాలు భయంతో వణికిపోయారు. తమ ఇళ్ళకు తలుపులు వేసుకుని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీశారు. అయితే అవి ఎవరిపై దాడి చేయకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే అడవుల్లోంచి క్రూర మృగాలు జనావాసాల్లోకి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated : 15 Sep 2019 10:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top