Lip scrubs you should try in winter
mictv telugu

పెదవులు పగిలిపోతున్నాయా? ఇవి ట్రై చేయండి!

November 24, 2022

చలికాలం వచ్చిందంటే.. చర్మం పగిలిపోతుంది. అలాగే పెదవుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనం సరైన చిట్కాలు పాటించకపోతే రక్తాలు కారిపోతాయి. అందుకే కొన్ని స్క్రబ్స్ మీకోసం..

మృదువైన చర్మంతో పాటు.. పెదవులు కూడా మారాలంటే ఏం చేయాలని అనుకుంటున్నారా? అయితే కొన్ని స్క్రబ్స్ ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో తయారు చేసుకోవచ్చు.
_ ఒక టేబుల్స్పూన్ తేనె, బ్రౌన్ షుగర్, అర టీ స్పూన్ నీళ్లు పోసుకోవాలి. దీన్ని మెత్తటి పేస్ట్ కాకుండానే కలుపుకోవాలి. దీన్ని పెదవులపై రాసి నెమ్మదిగా రాయాలి. ఇది పెదవుల పై ఉన్న మృతకణాలు తొలిగిపోయేలా చేస్తుంది.

_ పగిలిన పెదవులకు కొబ్బరినూనె మంచి మందు. కొబ్బరినూనెలో, కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాయాలి. ఇలా తరుచుగా చేస్తే మృదువైన పెదవులు మీ సొంతమవుతాయి.

_ లిప్ బామ్ రాసుకునే అలవాటు ఉందా? ఇంట్లోనే లిప్ బామ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ షీ బటర్లో, అర టేబుల్ స్పూన్ చక్కెర పొడి వేసి పేస్ట్లా చేసుకోవాలి. తరుచుగా దీన్ని పెదవులకు రాయడం వల్ల మృదువుగా మారుతాయి._ కాఫీ పొడిలో తేనె, గోరువెచ్చని నీళ్లు కలిపి పెదవులకు రాయాలి. కొద్దిసేపటి తర్వాత మెత్తటి గుడ్డతో తుడిచేయాలి. కాఫీ పొడి చర్మం పై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది.

_ ఒక టేబుల్ స్పూన్ చక్కెర, అర టేబుల్ స్పూన్ దాల్చిన పొడి, కొబ్బరి నూనె పోసి పేస్ట్లా చేయాలి. ఇందులో వెనీలా ఆయిల్ వేస్తే దీన్ని బాడీ స్క్రబ్గా కూడా వాడుకోవచ్చు.

_ విటమిన్ ఇ ఆయిల్, తేనె పోసి కలుపాలి. ఇది ట్యాన్ తొలగిస్తుంది. మాయిశ్చరైజర్గా కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.