విశాఖ ఉక్కు కర్మాగారంలో మళ్లీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఏకంగా 300 టక్కుల ఉక్కు ద్రవం నేలపాలైంది. బ్లాస్ట్ ఫర్నెస్ విభాగం నుంచి రైలింజన్‌తో రెండో స్టీల్ మెండింగ్ విభాగానికి తరలిస్తుండగా నేలపాలైంది. టోర్పిడో లాడిల్‌కు రంధ్రం పడ్డంతో మొత్తం బయటికి వచ్చేసింది. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. దెబ్బ తిన్న ట్రాకుకు మరమ్మతులు చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఇటీవల ద్రవ ఉక్కను తరలిస్తున్న లాడిల్ తెగిపోవడంతో తొమ్మిదిమంది గాయపడ్డం తెలిసిందే. 2017లో ఉక్కు ద్రవాన్ని తరలిస్తున్న క్రేన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో 140 టన్నుల ఉక్కు నేలపాలైంది. క్రేన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు.