Liquor ban in Goa for three days
mictv telugu

టూరిస్టులకు అలర్ట్.. గోవాలో మద్యం బంద్

July 30, 2022

పర్యాటకులకు స్వర్గధామంగా పిలిచే గోవాకు టూరిస్టుల తాకిడి దేశంలోని మిగతా ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది పర్యాటకులు అక్కడి బీచ్‌లతో పాటు తక్కువ ధరకు దొరికే విభిన్న రకాల మద్యాన్ని ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టు 9,10,12 తేదీలను డ్రైడేలుగా పాటించాలని ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మద్య నిషేధానికి కారణం ఏంటంటే అక్కడ ఆయా తేదీల్లో పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 186 పంచాయితీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు, 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో అన్ని మద్యం దుకాణాలు, లైసెన్స్ పొందిన బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, పర్యాటకులకు కూడా తెలిసేలా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం ఆహార సంబంధ వస్తువులు అమ్మేందుకు మాత్రమే దుకాణాలు తెరవాలని స్పష్టం చేసింది.